తలమడుగు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి!

Published on

-Advertisement-

తలమడుగు అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎం కు వినతి పత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి 

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్శన సందర్భంగా తలమడుగు మండల మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి మండల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తలమడుగు మండలంలో రహదారులు, త్రాగునీటి సదుపాయం, వ్యవసాయ మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర కీలక రంగాల్లో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, అదే స్థాయిలో తలమడుగు మండలానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గణేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు మాజీ జడ్పిటిసి తెలిపారు. స్థానిక ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెట్టుకుని ఉన్న ఈ సమయంలో గోక గణేష్ రెడ్డి చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది.

Latest articles

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

రైతులకు ఊరట – మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మన భారత్, తాంసి: రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే Anil...

అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ

మన భారత్, తలమడుగు:  తలమడుగు, తాంసి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు మరియు సూపర్వైజర్లకు స్థానిక ఎమ్మెల్యే Anil Jadhav...

More like this