గ్లోబల్ సమ్మిట్కు రాలేనని ఖర్గే లేఖ — రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు!
మన భారత్, హైదరాబాద్: 2025కు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేక పోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
🔹 పార్లమెంట్ సమావేశాలతో బిజీగా…
పార్లమెంటు సమావేశాలు, ఇప్పటికే ఖరారైన ఇతర కార్యక్రమాల కారణంగా సమ్మిట్‌కు రావడం సాధ్యం కాదని లేఖలో తెలిపారు. తాను హాజరు కాలేకపోవడం బాధగా ఉందని పేర్కొన్నారు.
🔹 సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్ష
తెలంగాణ అభివృద్ధికి ఇది కీలకమైన సదస్సని,
ఇందులో జరిగే చర్చలు, ఒప్పందాలు రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
🔹 రేవంత్‌కు శుభాకాంక్షలు
సదస్సును విజయవంతంగా నిర్వహించే దిశగా సీఎం రేవంత్ చేస్తున్న కృషిని అభినందిస్తూ,
“ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి కొత్త దిశను చూపాలి” అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.
ఇక ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు జరగనున్న ఈ సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు, టెక్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
