సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక

Published on

📰 Generate e-Paper Clip

సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక

-పోలింగ్ దాకా ఆగొద్దు

-ఆఫీసర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

మన భారత్, తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లంతా ఏకగ్రీవమైతే ఉప సర్పంచ్ ఎంపిక కోసం పోలింగ్ తేదీ దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఏరోజు ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారో.. ఆరోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు కీలక సర్క్యులర్ జారీ చేసింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రెండు దశల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. నామినేషన్ ల ప్రక్రియను స్టేజ్1 ఆఫీసర్ చూస్తే.. పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికను స్టేజ్2 ఆఫీసర్ చూస్తారు. ఒక పంచాయతీలో అన్ని స్థానాలు ఏకగ్రీవమైనప్పుడు.. పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే, ఫలితాలను డిక్లేర్ చేస్తారు. ఇలా డిక్లేర్ చేసిన రోజే.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఏదైనా ఒక్క వార్డులోనైనా పోటీ ఉండి, పోలింగ్ జరగాల్సి వస్తే మాత్రం.. పాత పద్ధతిలోనే పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యాక చివరలో ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this