వైట్ ఎగ్స్‌కు రంగేసి ‘నాటు కోడి గుడ్లు’ అంటూ విక్రయం… మురాదాబాద్‌లో నకిలీ గుడ్ల ముఠా అరెస్టు
ఫుడ్ సేఫ్టీ దాడులతో పెద్ద ఎత్తున మోసం బయటకు
మన భారత్ , ఉత్తర ప్రదేశ్ : రాష్ట్రం లోని మురాదాబాదు నగరంలో నకిలీ నాటు కోడి గుడ్ల రాకెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఛేదించారు.
దర్యాప్తులో భాగంగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం—ఇప్పటికే 4.5 లక్షలకు పైగా గుడ్లను రంగులు మార్చి నాటు కోడి గుడ్లుగా మార్కెట్లోకి పంపించినట్లు తేలింది. అదనంగాB గోదాంలో ప్యాకింగ్‌కి సిద్ధంగా ఉన్న 45,000 నకిలీ గుడ్లను సీజ్ చేశారు. రంగులు పూసి, సహజమైన నాటు కోడి గుడ్లలా చూపించేందుకు ముఠా ప్రత్యేక పద్ధతులను ఉపయోగించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మార్కెట్‌లో అచ్చమైన నాటు కోడి గుడ్ల పేరిట విక్రయించే వస్తువులపై జాగ్రత్త వహించాలని, అనుమానాస్పద ఉత్పత్తులను వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా నకిలీ ఆహార పదార్థాల విక్రయం ఎంతటి స్థాయికి చేరిందో మరోసారి స్పష్టంచేసింది.
