IBలో 362 ఉద్యోగాలు: నేటి నుంచే అప్లై చేయండి – టెన్త్ పాస్‌కు గోల్డెన్ ఛాన్స్
మన భారత్, హైదరాబాద్: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి, 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు.
జీతం రూ.18,000 – రూ.56,900 శ్రేణిలో ఉండనుండగా, ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14గా ప్రకటించారు. తెలంగాణలోని హైదరాబాద్ బ్యూరోలో 6, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బ్యూరోలో 3 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.ncs.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
