తుమ్మలను దూరం చేయడం BRS పెద్ద తప్పు… పార్టీ ఓటమికి అదే కారణం: కవిత విమర్శ
మన భారత్, తెలంగాణ: మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనబాట యాత్రలో మాట్లాడుతూ, ఎంతో అనుభవం ఉన్న నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ నుండి దూరం చేయడం కేసీఆర్ చేసిన పెద్ద పొరపాట్లలో ఒకటని కవిత విమర్శించారు. ఈ నిర్ణయమే BRS మళ్లీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇంకా, 20 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తనను కూడా కుట్ర పన్ని బయటికి నెట్టేశారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలు చెప్పే గొంతులు నిద్రపోతున్నాయని, ప్రతిపక్షం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని ఆమె మండిపడ్డారు.
BRS పతనానికి నాయకత్వ పొరపాట్లే కారణమని స్పష్టమైన సందేశం ఇస్తూ, ప్రజల మాట వినే నాయకత్వమే తెలంగాణకు అవసరమని కవిత వ్యాఖ్యానించారు.
#Kavitha #KCR #BRS #TummalaNageswaraRao #TelanganaPolitics #ManaBharath.Com
