దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

Published on

దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

మన భారత్, ఇచ్చోడ, నవంబర్ 6: దళిత బంధు పథకం పేరుతో మోసం చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో వెలుగులోకి వచ్చింది. తలమాద్రి గ్రామానికి చెందిన అక్కనపల్లి సుమన్ నుంచి దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి దాసరి భాస్కర్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. అయితే పథకం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలో బాధితుడు సహా ముగ్గురు వ్యక్తులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భాస్కర్‌పై మోసం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ బండారి రాజు మీడియాతో వెల్లడించారు.

సీఐ మాట్లాడుతూ, “దళిత బంధు లేదా ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ప్రభుత్వ పథకాల కోసం ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Latest articles

హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన

మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో...

అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్

మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్...

More like this