సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్న రాణమ్మకు రూ.58,500 ఆర్థిక సహాయం , కాంగ్రెస్ నాయకుల చేతులమీదుగా చెక్కు అందజేత
మన భారత్, మెదక్ జిల్లా, శివంపేట మండలం:
ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కార్యక్రమంలో భాగంగా, పిల్లుట్ల గ్రామానికి చెందిన సండ్ర రాణమ్మ గారికి రూ.58,500/- చెక్కును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాఘవరెడ్డి, యువ నాయకులు బుర్ర మురళి గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మురళి గౌడ్ మాట్లాడుతూ, “పిల్లుట్ల గ్రామంలో పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా ధ్యేయం,” అని అన్నారు. ఆయన మరింతగా మాట్లాడుతూ, “మన మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారు సాయసహకారాలతో, యువనేత శంకరన్న గారి మార్గదర్శకత్వంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాం,” అని తెలిపారు.
గ్రామంలో అవసరమైన వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొమ్మిడాల దశరథ, పిల్లి శ్రీనివాస్, బొమ్మిడాల శంకర్, పిల్లి మధు, సండ్ర వేణు, నర్సింలు గౌడ్, పెద్దపులి సతీష్, తలారి హనుమంతు, పెద్దపులి రమేష్, మంగలి శ్రీనివాస్, సాలె వెంకటేష్, గుల్లయిగారి రవి, రంగప్ప బాలేష్, మధుసూదన్, మాస్కురి ప్రవీణ్, కనుకుంటా కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు ఈ సహాయనిధిని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
