💰చెత్తలో నిధి..! యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు..! 

Published on

📰 Generate e-Paper Clip

మంగళూరులో సంచలన సంఘటన — ప్రజలు, పోలీసులు ఆశ్చర్యంలో!

మన భారత్, స్టేట్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. చెత్త కుప్పల దగ్గర సంవత్సరాలుగా నివసిస్తున్న ఓ యాచకురాలి దగ్గర లక్షల రూపాయల నగదు బయటపడటంతో ప్రాంతమంతా కలకలం రేగింది.

సమాచారం ప్రకారం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళ గత 13 ఏళ్లుగా నగరంలోని ఒక వీధి మూలలో చెత్త కుప్పల మధ్యే జీవిస్తోంది. స్థానికులు ఆమెను సురక్షిత స్థలానికి తరలించాలనే నిర్ణయంతో ముందుకొచ్చారు. అయితే ఆమె చేతిలో ఉన్న కొన్ని సంచులను గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో అనుమానం కలిగింది.

ఆ సంచులను బలవంతంగా తెరిచి చూశే సరికి అందరూ షాక్ అయ్యారు. అందులో పాత నోట్లు, కొత్త నోట్లు, నాణేలు కలిపి భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. స్థానికులు లెక్కించగా ఆ మొత్తము ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. యాచకురాలిని వైద్య పరీక్షల అనంతరం స్థానిక అనాథ శరణాలయానికి తరలించారు.

ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతూ — “ఎక్కడినుంచి ఈ డబ్బు వచ్చింది..? ఆమెకు ఎవరు ఇచ్చారు..? లేదా ఏదైనా కాలంగా భిక్షాటన ద్వారా సేకరించిందా?” అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పోలీసులు ప్రస్తుతం ఆ నగదు మూలం గురించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనతో మంగళూరు నగరంలో పెద్ద చర్చ మొదలైంది.

Latest articles

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

More like this