దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా
చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన ఎలగొండ స్వామి కుటుంబానికి 1999–2000 పదో తరగతి స్నేహితులు అండగా నిలిచారు. స్నేహితులందరి సహకారంతో చిట్యాల పోస్టాఫీసులో 31 వేల రూపాయలు నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, అందుకు సంబంధించిన పాస్‌బుక్‌ను మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో తోటి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో
శీలపాక రాజు సరిగొమ్ముల రాజేందర్, గుర్రం శంకర్, ఉప్పుల కిరణ్, గుర్రం తిరుపతి,పోరండ్ల రమేష్, ఎలగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
