బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

Published on

-Advertisement-

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ

-బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా?

-ఫ్లెక్సీలో బీసీ మంత్రి కొండా సురేఖ ఫోటో ముద్రించకుండా అవమానించిన రెడ్డీలు

-ఓ బీసీ సమాజమా ఇకనైనా మేలుకో..బీసీలకు జరుగుతున్న అవమానాలపై తిరగబడు

-వేముల మహేందర్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీసీ మంత్రి అయినందుకేనా? ప్రోటోకాల్ పాటించకపోవడం..ఆమె ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించక అవమానించడం..బీసీలు అంటే ఇంత చులకనా రేవంత్ జీ?..సామాజిక న్యాయం అంటే ఇదేనా రాహుల్ జీ? అంటూ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం కేసముద్రం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైన బహిరంగ సభ ఫ్లెక్సీల్లో జిల్లాలో బీసీ మంత్రి అయినటువంటి కొండా సురేఖ ఫోటో ఎందుకు వేయలేదని ఆయన నిలదీశారు. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ఫోటో, శిలాఫలకాల్లో పేరు లేకపోవడం బీసీ సమాజాన్ని కించపరచడమేనన్నారు. ఒకపక్క కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లను దండుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి..అంచెలంచలుగా బీసీలను అణగదొక్కుతూ..అవమానిస్తూ.. జనాభాలో నాలుగు శాతం లేని రెడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాడని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా..మిగతా ఏడు జనరల్ అసెంబ్లీ సీట్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఏకైక బీసీ మహిళా అభ్యర్థిగా వరంగల్ తూర్పు నుండి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలిచిన కొండా సురేఖ ప్రతిష్టతను గుర్తించిన అధిష్టానం ఆమెకు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో చోటు కల్పించిందని, దీంతో మంత్రివర్గం చేపట్టినప్పటి నుండి పచ్చ కాంగ్రెస్ వర్గమంతా ఏకమై..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుట్రలు పన్నుతూ..బీసీ మహిళా మంత్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహేందర్ గౌడ్ ఆరోపించారు. సోదర, సోదరీ భావంతో..కలుపుగోలుతనం కలిగిన మంత్రి కొండా సురేఖను ఇబ్బందులకు గురిచేసి..మంత్రివర్గం నుంచి తొలగించేందుకు చేస్తున్న అగ్రవర్ణాల కుట్రలను అదాపాతంలో తొక్కేస్తామని, కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా గుర్తించి..కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల ఆధిపత్యానికి ముగింపు పలకాలని, లేకుంటే బీసీ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని హెచ్చరించారు.

మీ పవన్ కల్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

More like this