శ్రీ సాయి ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీ సాయి ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్తులు శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యుడు డా. వల్లేవాడ్ రాహుల్ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు, టాబ్లెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ అవసరమైన రోగులకు వైద్యుల సూచనల మేరకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించే అవకాశం కల్పిస్తామని వివరించారు.
అలాగే కంటి చూపు సమస్యలున్న వారికి అవసరమైన కళ్లద్దాలను సగం ధరకే అందించడంతో పాటు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తామని డా. రాహుల్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
కంటి పరీక్షలు చేయించుకున్న గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలుగు రాజన్న (చంటి), శ్రీ సాయి ఐ కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామస్తులు, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
