ఉచిత కంటి వైద్య శిబిరం..
శ్రీ సాయి ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీ సాయి ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు గ్రామస్తులు శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యుడు డా. వల్లేవాడ్ రాహుల్ మాట్లాడుతూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు....