532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

Published on

-Advertisement-

ఎండు గంజాయి స్వాధీనం

మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 532 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న అందిన విశ్వసనీయ సమాచారంతో లక్ష్మీ సాయి గార్డెన్ సమీపంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

రాత్రి సుమారు 7:20 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన నడికూడ మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సిద్ధును పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. బైక్ ట్యాంక్ కవర్‌లో దాచిన 532 గ్రాముల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన బైక్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సిద్ధును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో మరో నిందితుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమంగా మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎండీ రఫీ..

మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎండీ రఫీ మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా...

More like this