దేవపూర్ బ్రిడ్జి మరమ్మతులు వేగవంతం చేయాలి
నాణ్యతలో రాజీ పడొద్దు.. పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు,మన భారత్ జూలై 26: తలమడుగు మండలంలోని దేవపూర్ ప్రధాన రహదారిపై కొనసాగుతున్న బ్రిడ్జి మరమ్మతు పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం పరిశీలించారు. బ్రిడ్జి పనుల పురోగతిని సంబంధిత సిబ్బంది, నాయకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజల రాకపోకలకు కీలకంగా ఉన్న దేవపూర్ ప్రధాన రహదారి బ్రిడ్జి మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. పనుల్లో నాణ్యమైన నిర్మాణ సామగ్రిని వినియోగించాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.
వర్షాకాలంలో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల పూర్తిలో జాప్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
దేవాపూర్ ప్రధాన రహదారి బ్రిడ్జి మరమ్మతులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని స్థానికులు తెలిపారు. బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ అబ్దుల్లా, నాయకులు పిడుగు అభిరాం రెడ్డి, కేమ శ్రీకాంత్, సతీష్ రెడ్డి, రవికాంత్, నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి, సురేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
