అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ..

Published on

-Advertisement-

తెలంగాణ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి

దేవాపూర్ గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకావిష్కరణతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్మరించిన గ్రామ ప్రజలు

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పోరండ్ల సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఎందరో మహనీయుల పోరాటాలు, విద్యార్థుల ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, స్వాభిమానానికి చిరునామాగా ప్రత్యేక రాష్ట్రం నిలిచిందన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆశయాలను సాకారం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల పురోగతి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘాల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేకల శ్రీరామ్, పంచాయతీ కార్యదర్శి రాందాస్, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్, ఆడెపు శ్రీనివాస్, వాస్, శానం శ్రీనివాస్, గొనె శ్రీనివాస్ (యాదవ సంఘం మండల అధ్యక్షుడు), ఓసా రవి, నారాయణ, పట్ల వెంకటి, దూస నర్సింగ్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవాపూర్ గ్రామంలో దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవ భావాలు ప్రతిఫలించగా, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ గ్రామ ప్రజలు ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.

– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

Latest articles

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి...

More like this

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...