గోదాంకు ప్రత్యేక రహదారి లేక ప్రజలకు ఇబ్బందులు

Published on

-Advertisement-

చిన్న వీధుల గుండా వెళ్తున్న భారీ వాహనాలతో స్థానికుల్లో భయాందోళనలు

మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలం మండల కేంద్రంలో నిర్మించిన గోదాంకు సరైన రహదారి లేకపోవడంతో భారీ వాహనాలు గ్రామంలోని చిన్న వీధుల గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ గోదాంకు ఇప్పటికీ ప్రత్యేక దారి లేకపోవడంతో రోజురోజుకు సమస్య మరింత తీవ్రమవుతోందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామంలోని ఇరుకైన వీధుల గుండా భారీ లారీలు, ట్రక్కులు వెళ్లడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాద భయంతో జీవిస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కిరాణా దుకాణాలకు వెళ్లే చిన్నారులు, స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, గ్రామంలో తిరిగే ప్రజలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, భారీ వాహనాలు గ్రామ వీధుల్లోకి రావడంతో కొన్ని సందర్భాల్లో ఇండ్ల గోడలకు తాకుతూ వెళ్లిన ఘటనలు కూడా జరిగాయని తెలిపారు. రహదారులు చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాలు తిరగడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు అంటున్నారు.

ఇదివరకు కాలనీ వాసులు కలిసి భారీ వాహనాలను అడ్డుకొని ప్రధాన వీధుల గుండా రాకూడదని హెచ్చరించినప్పటికీ, అధికారులు వాహనాలకు అనుమతులు ఇవ్వడంతో మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

రైతులు పొలం పనుల కోసం ట్రాక్టర్లు, చిన్న వాహనాలతో వెళ్లేటప్పుడు భారీ వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వంటి వాహనాలు వెళ్లడానికీ ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ సమస్యపై వెంటనే అధికారులు స్పందించి గోదాంకు ప్రత్యేక రహదారి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుని గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. గోదాంకు ప్రత్యేక రహదారి నిర్మిస్తే గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

గ్రామ ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

మా టీచర్ ను మాకే కేటాయించాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this

మా టీచర్ ను మాకే కేటాయించాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...