నష్ట పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే GSR

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి :

మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జిఎస్సార్) పరిశీలించారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో కూసు కొమురయ్య, గోనె శ్రీనివాస్, మొర్రి ఐలయ్య, పిండి దేవేందర్, నల్ల బుచ్చి రెడ్డి, నల్ల రాములు తదితర రైతులకు చెందిన సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హుటాహుటిన గ్రామానికి చేరుకుని, నష్టపోయిన పంట చేలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం వల్ల ఎదురైన ఇబ్బందులను రైతులు వివరించగా, వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులకు సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉండే కారణంగా రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ పరిశీలనలో ఎమ్మార్వో, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this