క్షణాల్లో టెన్త్ ఫలితాలు.. ఇక్కడ క్లిక్ చేయండి

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు (బుధవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) భవనం ఆవరణలో ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొని ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారిక సమాచారం. పరీక్షలు ప్రశాంతంగా ముగియగా, విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా

ఈ వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి మార్కుల వివరాలు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.

వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు…

ఈసారి విద్యార్థుల సౌలభ్యం కోసం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులోకి తెచ్చారు. అధికారిక మీసేవా వాట్సాప్ నంబర్ 80969 58096కు “Hi” అని మెసేజ్ పంపి, తరువాత “SSC Result” అని టైప్ చేయాలి. అనంతరం “Open Services” ఎంపిక చేసుకుని హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే మార్కుల మెమో పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాలను ప్రశాంతంగా పరిశీలించాలని, ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైతే అధికారిక వెబ్‌సైట్లను తిరిగి ప్రయత్నించాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this