అంబేద్కర్ సాక్షిగా ఆ ఊరిలో మద్యపానం నిషేధం 

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉడ్మల్ గిద్ద గ్రామంలో సామాజిక ఐక్యతతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. KVPS  అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో గ్రామసభ మద్యం, గుట్కా నిషేధానికి తీర్మానం చేయడం విశేషం.

కేవిపిఎస్ నాయకులు దొబ్బలి భీంశప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్యమ్మ గోపాల్ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు.

గ్రామాభివృద్ధి కోసం మద్యపానం, గుట్కా వినియోగం పూర్తిగా నిషేధించాలని గ్రామపంచాయతీ, గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం, బీరు, బిస్కీ, గుట్కా, విమల్, నాసిక్ వంటి హానికర పదార్థాల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించారు.

ప్రజలందరూ సహకరించి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మద్యం, గుట్కా వినియోగాన్ని పూర్తిగా మానుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మద్దూర్ ఏరియా కార్యదర్శి గోపాల్, గ్రామ కార్యదర్శి ప్రకాష్, హన్మంతు, ఉపసర్పంచ్ తాయప్ప, హన్మిరెడ్డి, వీరప్ప, నర్సిములు, దొబ్బలి మల్లేష్, కాశప్ప, దరికింది గోపాల్, అశోక్, మహేష్, అంజి, రాములు, దామోదర్, భీంశప్ప, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this