BiPC విద్యార్థులకు విస్తృత అవకాశాలు

Published on

-Advertisement-

మన భారత్, ఎడ్యుకేషన్:

ఇంటర్మీడియట్‌ లో BiPC (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్ రంగం మాత్రమే కాకుండా వ్యవసాయం, పారామెడికల్, సైన్స్ రంగాల్లో అనేక కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

BiPC పూర్తి చేసిన విద్యార్థులు ముఖ్యంగా NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశ పరీక్షల ద్వారా పలు ప్రముఖ కోర్సుల్లో చేరవచ్చు. NEET ద్వారా MBBS, BDS, ఆయుర్వేద (BAMS), హోమియోపతి (BHMS), అలాగే వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా డిగ్రీ స్థాయిలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ వంటి కోర్సులకు కూడా ఇటీవలి కాలంలో మంచి డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

ఇంకా ఆరోగ్య రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులు నర్సింగ్,  జియోథెరపీ వంటి పారామెడికల్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు సైన్స్ రంగంలో ముందుకు వెళ్లాలనుకునే విద్యార్థులు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీ వంటి విభాగాల్లో BSc కోర్సులు చేయవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని సరైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో మంచి కెరీర్ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సరైన ప్రణాళికతో ఉన్నత విద్యను కొనసాగించడం చాలా అవసరమని వారు చెబుతున్నారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this