e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీ.. 44వ వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ ప్రాంతంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 44వ వార్డులో గెలుపొందిన ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు.

విజయోత్సవం సందర్భంగా అనుమతి లేకుండా డీజేతో ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో షేక్ షోహిబ్, షేక్ ఇమ్రాన్‌తో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో ఉపయోగించిన ఆటో, డీజే సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేసినట్లు వివరించారు.

ఎన్నికల సమయంలో చట్టం, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఐ నాగరాజు స్పష్టం చేశారు. ఎవరు అయినా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల అనంతర వేడుకల విషయంలో అనుమతులు తీసుకుని చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE