e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

పదో తరగతి అర్హతతో 28,740 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే నియామకాలు!

మన భారత్, న్యూఢిల్లీ:

భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్తగా, ఇండియా పోస్టు గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది ఎంపిక చేపడతారు. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులకు తమ సొంత గ్రామంలోని తపాలా శాఖలోనే పని చేసే అవకాశం ఉంటుంది.

అర్హతలు:

* పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి

* సైకిల్ లేదా బైక్ నడపడం తెలిసి ఉండాలి

* వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య

* ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు

దరఖాస్తు వివరాలు:

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

* చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026 (రాత్రి 11.59 గంటల వరకు)

దరఖాస్తు ఫీజు:

* జనరల్ అభ్యర్థులకు రూ.100

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు

దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఫిబ్రవరి 18, 19 తేదీల్లో సవరణలకు అవకాశం కల్పించారు.

జీతభత్యాలు:

BPM పోస్టులకు: నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు

ABPM / డాక్ సేవక్ పోస్టులకు: నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పదో తరగతి మార్కులు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే జరుగుతుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకపోవడంతో ఈ ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE