నవాబుపేట సర్పంచ్ గీతారాణికి ఘన సన్మానం..

Published on

-Advertisement-

నవాబుపేట సర్పంచ్ గీతారాణికి ఘన సన్మానం.. ఫర్టిలైజర్స్ యూనియన్ అభినందనలు

మన భారత్, మహబూబ్‌నగర్ జిల్లా (జడ్చర్ల నియోజకవర్గం) :

నవాబుపేట మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ గీతారాణిని నవాబుపేట ఫర్టిలైజర్స్ యూనియన్ కార్యవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం దిశగా ఆమె చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ సత్కారం నిర్వహించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా సర్పంచ్ గీతారాణి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రైతు సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్‌తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

సన్మానానికి స్పందించిన సర్పంచ్ గీతారాణి మాట్లాడుతూ, రైతులే గ్రామానికి వెన్నెముక అని పేర్కొంటూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తనవంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో జేకే ట్రస్ట్ డైరెక్టర్ సుధాకర్ చారి, చైర్మన్ నరసింహా చారి తదితరులు పాల్గొన్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this