కత్తెర గుర్తుకు ఓటు వేయాలని పిలుపు..

Published on

-Advertisement-

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి బాట వేయాలి: సలాం రఘునాథ్

మన భారత్, తలమడుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్సికే గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా సలాం రఘునాథ్ మాట్లాడుతూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి పల్సికే గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి సమస్యలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సహకరించాలని సలాం రఘునాథ్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం ఏకతాటిపై నిలబడి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటే పల్సికే గ్రామం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

ఉద్యమకారులను మోసం చేస్తే సహించం..

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (మన భారత్): ఆంధ్ర పెత్తందారి పాలకుల వ్యవస్థ...

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్..

కేటీపీపీ సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ మన భారత్, భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు కాకతీయ...

More like this