రికార్డ్ బ్రేక్ సేల్స్… నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు

Published on

-Advertisement-

రికార్డ్ బ్రేక్ సేల్స్… నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చలి విరుచుకుపడుతున్నా, మద్యం సేల్స్ మాత్రం అదిరిపోయే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతుండగా… లిక్కర్ షాపుల వద్ద మాత్రం ఎప్పటిలానే రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిల్డ్ బీర్ సేల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేశాయి.

నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్ల సేల్స్

డిసెంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ రాత్రివరకూ మొత్తం 578.86 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇది దాదాపు రూ.600 కోట్ల మార్క్‌ను దాటినట్లే ఈ నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల బీర్ కేసులు అమ్ముడవడం విశేషం.

గత ఏడాదితో పోలిస్తే భారీ వృద్ధి

గత ఏడాది ఇదే సమయంలో 4.26 లక్షల కేసులే బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అమ్మకాలు 107% వృద్ధి సాధించడం పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.

రెండేళ్లలో రికార్డు స్థాయి వ్యాపారం

2023–25 మధ్య అమల్లో ఉన్న పాత మద్యం పాలసీ ఆదివారంతో ముగిసింది. ఈ రెండు సంవత్సరాలు తెలంగాణ లిక్కర్ మార్కెట్‌కు స్వర్ణయుగంగా నిలిచాయి.

మొత్తం 724 లక్షల లిక్కర్ కేసులు

960 లక్షల బీర్ కేసుల విక్రయాలు నమోదయ్యాయి.

సంవత్సరాల వారీగా అమ్మకాలు

2023 డిసెంబర్: రూ.4,297 కోట్లు

2024 జన–డిసెం: రూ.37,485 కోట్లు

2025 జన–నవం: రూ.29,766 కోట్లు

ఈ గణాంకాలన్నీ పరిశీలిస్తే… మద్యం అమ్మకాలు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. చలి, వేడి, పండుగలు… ఏ సందర్భమైనా టీఎస్ లిక్కర్ మార్కెట్ వేడిగానే ఉందన్నది మరలా రుజువైంది.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this