ఆంధ్ర వ్యక్తి తెలంగాణలో ఏటీఎం చోరీ యత్నం… పోలీసుల వలలో నిందితుడు
మన భారత్, తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నుంచి తెలంగాణ వచ్చి చోరీకి పాల్పడడం జరిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా కోర్టు భవనం సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన రెండు ఏటీఎంలను ధ్వంసం చేసి దోపిడీకి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం—ఒక వ్యక్తి రాడ్‌తో ఏటీఎంలను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అలారం మోగడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పోలీసులను గమనించిన ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించారు. దర్యాప్తులో ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన చాట్ల ప్రవీణ్‌గా తేలింది. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటనతో స్థానికంగా అలజడి రేగగా, ఏటీఎంల భద్రతపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
