ఫిట్నెస్ ఫ్రీక్‌గా మెరిసిన భారత యువ క్రికెటర్ నికీ ప్రసాద్
మన భారత్, హైదరాబాద్: క్రికెట్‌లో ఫిట్నెస్ అనగానే ఎక్కువ మంది పురుష క్రికెటర్లను గుర్తు చేస్తారు. జిమ్ వర్కౌట్లు, ట్రైనింగ్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చేసేలా ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో నెట్టింట్లో చర్చనీయాంశమైంది.
U-19 T20 వరల్డ్ కప్–2025 విజయ కెప్టెన్ నికీ ప్రసాద్ తన ఫిట్నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె జిమ్‌లో చేసిన కష్టాన్ని, కసరత్తులను చూసి అభిమానులు, క్రికెట్ ప్రేమికులు “ఫిట్నెస్ విషయంలో మహిళలూ పురుషులకు ఏమాత్రం తగ్గరు” అని ప్రశంసిస్తున్నారు.
నికీ ప్రసాద్ ఫొటో వైరలవడంతో భారత మహిళా క్రికెటర్ల ఫిట్నెస్, ఫిజికల్ ప్రిపరేషన్‌పై కొత్త చర్చ మొదలైంది. టీమ్ ఇండియాకు రాబోయే కాలంలో ఆమెలాంటి యంగ్ టాలెంట్ మరింత బలం చేకూర్చనుంది అన్న అభిప్రాయం స్పోర్ట్స్ వర్గాల్లో కనిపిస్తోంది.
