“కాంగ్రెస్కు కాదు… నవీన్‌కే మా సపోర్టు”

Published on

-Advertisement-

“కాంగ్రెస్కు కాదు… నవీన్‌కే మా సపోర్టు” – అసదుద్దీన్ స్పష్టం

మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, వాస్తవానికి వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కి మాత్రమే సపోర్టు చేశామని తెలిపారు. కొన్ని వర్గాలు తమ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఉపఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన ఒవైసీ, “నవీన్ మంచి పనులు చేస్తాడని భావించి మేము ఆయనకు మద్దతిచ్చాం. ఇది కాంగ్రెస్‌కు సపోర్టు చేసినట్టుగా భావించడం సరైంది కాదు” అని అన్నారు.

అదే సమయంలో, బీఆర్ఎస్‌తో ఎటువంటి విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. “కేసీఆర్‌గారు అయినా, నేను అయినా… మా మా పార్టీలకు మంచిదనిపించేదాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తాం” అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీల రాజకీయ లెక్కలపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

#AsaduddinOwaisi #JubileeHillsBypoll #NaveenYadav #AIMIM #TelanganaPolitics #ManaBharath.Com

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this