ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం..

Published on

-Advertisement-

వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన ర్యాలీతో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు

మన భారత్, తాంసి, నవంబర్ 7: ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాంసి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం విజయవంతంగా ముగిసింది. వామన్ నగర్ గ్రామంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో వ్యక్తిగత మరుగుదొడ్ల ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీని వాలంటీర్లు నిర్వహించారు.

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బహిర్భూమికి వెళ్లడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం స్వచ్ఛతను కాపాడడంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వాటిని వినియోగించడం ద్వారా గ్రామం ఆరోగ్యవంతంగా మారుతుందని సూచించారు.

ముగింపు కార్యక్రమంలో గ్రామ పటేల్ మారుతి పటేల్, భూమారెడ్డి, అశోక్, యశ్వంత్, పరశురాం, ఆకాష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్. సంతోష్, అధ్యాపకులు దేవేందర్, రమణ, తిరుపతిరెడ్డి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు. స్వచ్ఛత స్ఫూర్తితో ముందుకు సాగాలని గ్రామ పెద్దలు సూచించారు.

Latest articles

మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్

రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..

దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్,...

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

More like this