మన భారత్, తెలంగాణ: అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయి, నాణ్యత ప్రమాణాలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని పేరుతో అధికారులు కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “కొందరు రైతులు పత్తి తీసుకెళ్లగానే 12 శాతం దాటిందని చెప్పి నేరుగా తిరిగి పంపుతున్నారు. తేమ 20 శాతం వరకు ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అధికారులు దానిని పట్టించుకోవడం లేదు” అని తెలిపారు. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకు కేవలం రూ.6,950కి పత్తి అమ్ముకుంటున్నారని, ఇది కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 కంటే తక్కువ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రకృతి వైపరీత్యాల సమయంలో అయినా మానవత్వం చూపించి మద్దతు ధరను రైతులకు అందించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత” అని సుకుమార్ పెట్కులే స్పష్టం చేశారు. అలాగే సోయా, మొక్కజొన్న పంటలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల రైతులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా స్లాట్ బుకింగ్ చేయడం కష్టమవుతోందని ఆయన చెప్పారు. “రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియను ఏఈఓల ద్వారా ప్రభుత్వమే నిర్వహించాలి” అని సూచించారు. రైతుల సమస్యల పట్ల సర్కారు కపట ప్రేమ కాకుండా సాకార చర్యలు తీసుకుంటేనే రైతు బతుకు బాగుపడుతుందని సుకుమార్ పెట్కులే ప్రభుత్వాలను హెచ్చరించారు. అధిక వర్షాలతో నాణ్యత ప్రమాణాలు పంట దిగుబడి తగ్గిపోయి దిక్కుతోచని స్థితిలో రైతన్న ఉంటే కాస్తో కూస్తో పండింన పంట అమ్ముదామని వెళ్తే తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయకుండా రైతన్నలపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమ ప్రదర్శిస్తుందని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు రైతులు మార్కెట్ యార్డుకు పత్తి తీసుకెళ్తే తేమశాతం పేరుతో పత్తి రైతులను 12 శాతం తేసూ దాటిందని చెప్పి కొనుగోలు చేయకుండా నట్టేట ముంచారని అన్నారు. తేమ 20 శాతం వరకు ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు 6950/- కి రైతులు అమ్ముకున్నారని అన్నారు. కనీసం ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడైనా మానవత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 8110/- ఇవ్వాలని కోరారు.. అలాగే సోయా, మొక్కజొన్న పంటలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతంలోని రైతులకు స్మార్ట్ ఫోన్స్ సౌకర్యం ఉన్న సిగ్నల్స్ ఉండవనీ కాబట్టి కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ ప్రభుత్వమే ఏఈఓ ల చేత చేయించాలని కోరారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు దృష్టి సారించాలని కోరారు.
పత్తి రైతులపై ప్రభుత్వాల కపట ప్రేమ.. మండిపడ్డ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే
Published on
