e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా..

మన భారత్ , ఆగస్టు25 ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు వన మహోత్సవం కార్యక్రమం కింద విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, ఖాళీ ప్రదేశాలు, రహదారుల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

నాటిన ప్రతి మొక్కను క్రమం తప్పకుండా పర్యవేక్షించి, వాటికి అవసరమైన నీటిని అందించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మొక్కలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత వన మహోత్సవంలో భాగస్వాములై మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు అందించాలని, వాటికి రక్షణ కల్పించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా జిల్లాలో ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, చైర్‌పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE