పర్యావరణాన్ని కాపాడండి: సర్పంచ్ వెంకన్న
కుచులాపూర్‌లో మొక్కలు నాటిన సర్పంచ్ మోడేపు వెంకన్న మన భారత్, ఆగస్టు,25, తలమడుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ చెట్ల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసర ప్రాంతంలో కనీసం ఒక్క...