e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

RiA రీట్రైనింగ్ రోబోటిక్స్ వర్క్‌షాప్..

  • నారాయణపేట జిల్లాలో జడ్పీహెచ్ఎస్ జాజ్‌పూర్ సోహం RiA రీట్రైనింగ్ రోబోటిక్స్ వర్క్‌షాప్ విజయవంతం

నారాయణపేట , ఆగస్టు 6, 2026:

నారాయణపేట జిల్లా జిల్లా పరిషత్ హై స్కూల్, జాజ్‌పూర్ సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్ (RiA) ఆధ్వర్యంలో, AMD సహకారంతో ఒకరోజు ప్రాక్టికల్ రోబోటిక్స్ రీట్రైనింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు.

ఈ వర్క్ షాప్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు విజయ మాట్లాడుతూ .. ఈ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 48 విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 31 మంది బాలికలు, 17 మంది బాలురు ఉన్నారు. గతంలో నేర్చుకున్న రోబోటిక్స్ అంశాలను మరోసారి ప్రాక్టికల్‌గా గుర్తు చేస్తూ, ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, మోటార్లు, సర్క్యూట్ బిల్డింగ్, రోబోటిక్ పార్ట్స్ వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించారు.

విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు తయారు చేయడం, రోబోటిక్ మోడళ్లను రూపొందించడం, వివిధ యాక్టివిటీల్లో పాల్గొనడం ద్వారా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకున్నారు. ఈ రీట్రైనింగ్ వర్క్‌షాప్ ద్వారా రోబోటిక్స్ క్లబ్ కార్యకలాపాలను మరింత చురుకుగా కొనసాగించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందింది. అలాగే విద్యార్థులకు రాబోయే RiA Innovation Melas గురించి వివరంగా తెలియజేసి, వివిధ ఇన్నోవేషన్ చాలెంజ్‌లలో పాల్గొనేలా ప్రోత్సహించారు.

వర్క్‌షాప్ ముగింపు సందర్భంగా విద్యార్థులకు పాల్గొన్న ధ్రువపత్రాలు (Certificates of Participation) అందజేయగా, పాఠశాలలో రోబోటిక్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగేందుకు రోబోటిక్స్ ప్రాక్టీస్ కిట్‌ను పాఠశాల యాజమాన్యానికి, అలాగే ఎంపిక చేసిన రోబోటిక్స్ క్లబ్ సభ్యులకు “Essentials of Robotics & AI” పుస్తకాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి సహకారం అందించిన AMD కు సోహం RiA హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. అలాగే జిల్లా అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది, విద్యార్థులు మరియు అంకితభావంతో శిక్షణ అందించిన RiA ట్రైనర్లకు వారి సహకారం, ఉత్సాహం, కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

సోహం అకాడమీ ట్రైనర్స్ అజయ్ కుమార్ స్వప్న విజయలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు భాను ప్రకాష్ నిర్మల శశిరేఖ నరసింహ నర్సింలు రఘురాం రెడ్డి మధుసూదన్ లక్ష్మణ్ పాల్గొన్నారు

సహదేవ్ కొమరగిరి గారు స్థాపించిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఒక స్వచ్ఛంద సంస్థ. విద్యార్థుల్లో టెక్నాలజీపై ఆసక్తిని పెంచడం, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. సంస్థకు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్ (RiA) కార్యక్రమం ఇప్పటికే తెలంగాణలోని అన్ని 33 జిల్లాలకు చేరుకుని లక్షకు పైగా విద్యార్థులకు ప్రాక్టికల్ రోబోటిక్స్ శిక్షణ అందించింది. అకాడమీ ఆధ్వర్యంలో సోహం లీడర్‌షిప్ ప్రోగ్రామ్ (SLP), సోహం యోగా, సోహం సుస్వర వంటి కార్యక్రమాలు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని వివరాలకు: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్: (93812 41285) ను సంప్రదించండి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE