పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం
పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు పచ్చగా ఉంటేనే..ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తారని, పచ్చదనంతో పాటు పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు పిడిసిల్ల పాలకవర్గానికి పూర్తిగా సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామ సర్పంచ్ నైనకంటి మమత ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామంలోని రోడ్లకిరువైపులా...