విధి వంచిన వైనం.. సీఎం గన్ మెన్ మృతి

Published on

-Advertisement-

విధి వంచిన వైనం

-రోడ్డు ప్రమాదంలో ముఖ్యమంత్రి గన్‌మెన్ కిరణ్ మృతి

-ఒకప్పుడు మెదక్ ఉప సభావతి పద్మ గన్మెన్!

-ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వేముల మహేందర్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

అంకితభావంతో విధినిర్వహణ చేస్తున్న ఒక పోలీస్ అధికారి, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలీస్ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో గన్‌మెన్‌గా పనిచేస్తున్న కిరణ్ (2009 బ్యాచ్) నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

అంచెలంచెలుగా ఎదిగిన వైనం..

2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ శాఖలో చేరిన కిరణ్, తన విధి నిర్వహణలో ఎంతో సమర్థతను ప్రదర్శించారు. పారదర్శకంగా, నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల వద్ద గన్‌మెన్‌గా పనిచేసి, తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు.

మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా..

ఆ తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి  సెక్యూరిటీ టీమ్‌లో కీలక బాధ్యతలు

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తూ, తన వృత్తిలో మరింత గుర్తింపు..

విద్యార్థి దశ నుంచే చురుకైన వ్యక్తిత్వం..

సిద్దిపేట సమీపంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన కిరణ్, ఉన్నత చదువుల కోసం సిద్దిపేటలోని వైపిఆర్ డిగ్రీ కళాశాలను ఎంచుకున్నారు. అక్కడే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆయన, పోలీస్ శాఖలోకి ప్రవేశించి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేశారు. ఆయన సహచరులు, తోటి బ్యాచ్ మేట్లు గుర్తు చేసుకుంటున్నట్లుగా, కిరణ్ అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్న చిరునవ్వుతో పలకరించే మృదుస్వభావి కావడంతో, సహోద్యోగులకు ఆయనంటే ఎంతో ఇష్టం. ఒక మంచి వ్యక్తి కిరణ్, కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తిని కోల్పోవడం పట్ల ఆయన మిత్రులు, పోలీస్ శాఖాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరం. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని కల్పించాలని, వారి కుటుంబానికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this