రెండు వాహనాలు సీజ్..

Published on

-Advertisement-

మొగుళ్ళపల్లిలో ప్రైవేట్ పాఠశాలల వాహనాల తనిఖీలను చేపట్టిన ఏఆర్టీవో సుందర్ నాయక్

-రెండు టాటా మ్యాజిక్ వాహనాలు సీజ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ప్రైవేట్ పాఠశాలల వాహనాల తీరు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని బ్రిడ్జి వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా పర్లపల్లి గ్రామంలో గల ఎస్వీ పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ తో పాటు మండల కేంద్రంలోని కేశవ హైస్కూల్ పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ లను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ఏఆర్టీవో సబ్ ఇన్స్పెక్టర్ సుందర్ నాయక్ మాట్లాడారు. కాలం చెల్లిన వాహనాలతో విద్యార్థులను పాఠశాలలకు తరలించడం మూలంగా ఆ వాహనాలు ప్రమాదాలకు గురై అనేకమంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా ఫిట్నెస్, వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ లాంటి పత్రాలు లేని వాహనాలను కూడా సీజ్ ఆయన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తుక్కు పట్టిన టాటా మ్యాజిక్ లలో, ఆటోలలో విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్లి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడొద్దన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఫిట్నెస్ లేని వాహనాలపై, ఆటోలపై, టాటా మ్యాజిక్ లపై నిరంతరం నిఘా ఉంచి వాటిని ఎప్పటికప్పుడు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this