ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం: తపస్

Published on

-Advertisement-

ఉద్యమించి పీఆర్సీ సాధించుకుందాం

– ప్రభుత్వ బడులను పటిష్టం చేద్దాం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం:

తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య

మన భారత్, నారాయణపేట, జూన్ 10:

ఎన్నో రోజులుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పీఆర్సీ (Pay Revision Commission) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని, ఉద్యమాల ద్వారానే పీఆర్సీ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి ఉపాధ్యాయుడి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా నిలవాలంటే ఉపాధ్యాయులు, అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవడం అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.

పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఉద్యోగులకు అందించే హెల్త్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేసిన తరువాతే అమలు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన వైద్య సేవలు అందేలా హెల్త్ కార్డు వ్యవస్థను మరింత పారదర్శకంగా రూపొందించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దకుండా అమలు చేస్తే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ బిల్లులు, సర్వీస్ సంబంధిత సమస్యలు, వైద్య సౌకర్యాలు వంటి అనేక అంశాల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 60 సార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అనే మూడు లక్ష్యాలతో తపస్ ముందుకు సాగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపట్టేందుకు సంఘం సిద్ధంగా ఉందన్నారు.

ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శేర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గుంపు బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, మహిళా కన్వీనర్ నర్మద, జిల్లా నాయకులు సీతారాములు, భీమ్రెడ్డి, తిరుపతయ్య, నర్సిరెడ్డి, వెంకటరాములు, శ్రీనాథ్, విజయ్ రెడ్డి, కనకప్ప, కురుమయ్యతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...