e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..

జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

ట్రాఫిక్ నియమాల పాటనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యం: పోలీసులు

మన భారత్, విజయనగరం:

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు రహదారి భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై వేగ నియంత్రణ స్టాపర్లు, రేడియం బోర్డులు, హెచ్చరిక స్టిక్కర్లను ఏర్పాటు చేశారు.

భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ పర్యవేక్షణలో డెంకాడ ఎస్సై సన్యాసినాయుడు పోలీసు సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా 25 సెట్ల టైర్లతో తయారు చేసిన వేగ నియంత్రణ స్టాపర్లను ఏర్పాటు చేశారు. వీటికి రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు అమర్చి రాత్రి వేళల్లో కూడా వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5వ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రధాన ద్వారం, ఇనాడ జంక్షన్, జొన్నాడ టీ పాయింట్, జొన్నాడ గ్రామ జంక్షన్, లెండి కళాశాల ప్రధాన ద్వారం, మొదవలస ఫ్రెష్ ఛాయిస్ సమీపం, మొదవలస చెక్‌పోస్ట్ ప్రాంతాల్లో ఈ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో గతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్దేశిత వేగ పరిమితులను గౌరవించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. రహదారులపై ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ స్టాపర్లను గమనిస్తూ వాహనాలను నడపాలని కోరారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టులు వినియోగించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

ప్రమాద రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అప్రమత్తతతో వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని డెంకాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE