ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Published on

-Advertisement-

తాంసీ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేస్తాం: సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి

మన భారత్, తాంసి:

తాంసీ మండల కేంద్రంలో మండల ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉప సర్పంచ్‌ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఆత్రం ఇంద్రదేవ్, అధ్యక్షులుగా మంత్రి గంగా రెడ్డి, ఉప అధ్యక్షులుగా మేశ్రం గణేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చింతలపల్లి రాంరెడ్డి, కోశాధికారిగా ఆత్రం భరత్ బాధ్యతలు స్వీకరించారు.

కార్యదర్శులుగా కమరి రమాకాంత్, కుంర అజయ్, బోయిని అనూషలను ఎన్నుకున్నారు. సలహాదారులుగా బారే నర్సింలు, అలారే నర్సింలును నియమించారు. కమిటీ సభ్యులుగా నర్లే సుశీల, మాడవి భుజంగ్ రావు, నిమ్లా మలయ్య, నరేష్ యాదవ్‌లను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌ల ఐక్యతను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.....

More like this