జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మెస్రం రూప కాశీరాం సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను తన దృష్టికి తేవాలని తెలిపారు బోథ్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 14 జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు మధ్యవర్తుల బారిన పడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

జొన్నల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సమయానుకూలంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంటలను విక్రయించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజకు విలువ దక్కేలా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తూకం, నిల్వ, రవాణా వంటి అంశాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ మెస్రం రూప కాశీరాం మాట్లాడుతూ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు కావడం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఘనంగా సన్మానించారు. రైతు సంక్షేమం కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి, తహశీల్దార్ రాజ్ మోహన్, వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, గ్రామ పెద్దలు, రైతన్నలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..

మన భారత్, బొండపల్లి: బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం...

మనం పర్యావరణం కాపాడుకుందాం: డాక్టర్ బొంతలకోటి శంకరరావు

మన భారత్, గజపతినగరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకు పిలుపు 54వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని...

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి....

వర్షాకాలం రాకముందే బోర్లు వేయండి సార్..!

రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళిత బస్తీ లబ్ధిదారుల ఆవేదన 21 మందికి మంజూరైన బోర్లలో ఐదుగురికే అమలు.. మిగతా...

More like this

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..

మన భారత్, బొండపల్లి: బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం...

మనం పర్యావరణం కాపాడుకుందాం: డాక్టర్ బొంతలకోటి శంకరరావు

మన భారత్, గజపతినగరం: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకు పిలుపు 54వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని...

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన..

నవధాన్యాల ప్రాముఖ్యత, పీఎండీఎస్ పద్ధతులపై రైతులకు అవగాహన ప్రకృతి వ్యవసాయంతోనే భూసారం పరిరక్షణ, రైతుకు లాభదాయక సాగు: జేడీఏ వి.టి....