మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలంలోని కప్పర్దేవి గ్రామంలో సీసీ రోడ్లు, నాలాల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షాలు పడితే ఇళ్లలోకి నీరు చేరుతున్నదని, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సమస్యపై కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌కు పలుమార్లు వినతి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని ఆరోపించారు.
మే నెలలోనే పనులు ప్రారంభిస్తే వర్షాకాలానికి ముందే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు కోరారు.
మంజూరైన నిధులను వినియోగించి వెంటనే సీసీ రోడ్లు, నాలాల నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేదంటే వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరించారు. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితిపై గ్రామంలో అసంతృప్తి నెలకొంది. సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
