పోలీసులతో దురుసు ప్రవర్తన… ఇద్దరికి రిమాండ్

Published on

-Advertisement-

మన భారత్ ,ఆదిలాబాద్ :

విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని బజార్హత్నూర్ ఎస్ఐ రమేశ్ వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 24న ముత్యంపేట కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఇత్తారి రాజేశ్ మరియు ధారంగుల దుర్గేశ్ అనే వ్యక్తులు పోలీసుల విధి నిర్వహణకు అడ్డంకిగా మారి వారితో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులను బెదిరిస్తూ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అదేవిధంగా, గొడవకు కారణమైన మరో ఆరుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రజలు శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this