మరో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

రాష్ట్రంలో పాఠశాలలో పసి మొగ్గలపై రోజు రోజుకు అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని  తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.

బాలల రక్షణ చట్టం కింద (POCSO) కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించినట్లు సమాచారం.

ఈ ఘటనతో ప్రాంతంలో ఆందోళన నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం.. మొక్కల నాటకంతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య...

“అమ్మ మాట.. అంగన్వాడి బాట” సర్పంచ్

'అమ్మ మాట.. అంగన్వాడి బాట’లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం విద్యకు తొలి అడుగు అంగన్వాడితోనే.. తల్లిదండ్రులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి:...

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

తలమడుగులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు వ్యసన రహిత...

ఆ యువకులకు ఘన సన్మానం..

దేవాపూర్ యువకులకు ఘన సన్మానం.. అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ముగ్గురు యువత దేశసేవకు సిద్ధమైన రాకేష్, గురు, లోకేష్...

More like this