మరో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో పాఠశాలలో పసి మొగ్గలపై రోజు రోజుకు అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు, పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులను ఉపాధ్యాయుడు అనుచితంగా తాకాడని ఆరోపణలు వచ్చాయి....