ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ.!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 

కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల ప్రకారం, ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని సీఐ సత్యనారాయణ బాధితునిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో సీఐ ఇంటిపై దాడి నిర్వహించి పట్టుకున్నారు.

దాడి సమయంలో సీఐ వద్ద అదనంగా రూ.45,670 నగదు కూడా లభించగా, దానిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐపై కేసు నమోదు చేసి న్యాయస్థానానికి హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో జిల్లాలో అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ప్రజలు ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Latest articles

అగ్ని ప్రమాదం.. స్పందించిన సర్పంచ్

అగ్ని ప్రమాదం – తక్షణమే స్పందించిన గ్రామ సర్పంచ్ మన, భారత్,మొగుళ్ళపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తిప్పారపు బుచ్చన్న వరి...

పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య : DEO గోవిందరాజులు

నారాయణపేట జిల్లా లోని. జిల్లాస్థాయి. ప్రభుత్వ పాఠశాలల లీడ్ ఎర్త్ లీడర్స్ కు ఒక రోజు శిక్షణ కార్యక్రమం...

పెద్ద పులి సంచారం కలకలం..

తలమడుగులో పులి సంచారం కలకలం కడపల్లి పంటచేల వద్ద పెద్దపులి కనిపించిందన్న ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో మన...

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

More like this