e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..

మన భారత్, మొగులపల్లి: 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులు (NCD) అయిన బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులను నియంత్రించడంలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఆశా కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా పరిశీలించి, ప్రతి విభాగంలోని సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. సేవల మెరుగుదలకు అవసరమైన సూచనలు కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ఎంపీడీవో సురేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. రాజేంద్రప్రసాద్, ఎంఎల్ హెచ్పి వైద్యులు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆస్పత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE