పీడీఎస్యూ నాయకులను విడుదల చేయాలి..

Published on

-Advertisement-

మన భారత్, నారాయణపేట:

ఇంటర్ మీడియట్ బోర్డు ముట్టడించిన పిడిఎస్ యు (PDSU) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని పిడిఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి రాజు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పిడిఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందస్తు అడ్మిషన్లను వ్యతిరేకిస్తూ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్న కళాశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు IIT, JEE, NEET వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా ప్రత్యేక అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలని సూచించారు. ఈ డిమాండ్లతో శాంతియుతంగా నిరసన చేపట్టిన పిడిఎస్ యు నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు.

అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this