ఇప్పపువ్వు లడ్డూల తయారీపై శిక్షణ..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో ఆదివాసి మహిళా సంఘాల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూ రెయిన్బో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పపువ్వు (మహువా పువ్వు) లడ్డూల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రాము మాట్లాడుతూ, ఆదివాసీలు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రకృతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి సరైన మార్గదర్శకత్వం, శిక్షణ కల్పిస్తే స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. ముఖ్యంగా చదువుకు దూరంగా ఉన్న గిరిజన మహిళలు, యువతులు ఉపాధి అవకాశాల లేమితో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటిడిఏ పరిధిలోని అనేక గిరిజన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు కూలి పనులపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తే ఆదివాసి సమాజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పటేలు, మహిళా సంఘాల నాయకులు ఆర్తి జంగుబాయి, గ్రామ వీడిసి సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు కడతారపు రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆసక్తిగా పాల్గొని లడ్డూల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసి మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు తెలియజేయడమే కాకుండా, గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపిందని స్థానికులు పేర్కొన్నారు.

Latest articles

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

More like this