e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఆర్ఐ సంతోష్ సేవలు మరువలేనివి..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (Revenue Inspector) సంతోష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలిసి అధికారులు, సహోద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వైద్యులు శ్రమించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంతోష్ తన సేవాకాలంలో పలు మండలాల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే అధికారి‌గా గుర్తింపు పొందారు. సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించడం, ప్రజలకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

సంతోష్ మృతి జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన సేవలను స్మరించుకుంటూ సహోద్యోగులు, స్థానికులు నివాళులు అర్పిస్తున్నారు.

ఆర్ఐ సంతోష్ అంత్యక్రియలు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి గ్రామంలో నిర్హహిస్తారని కుటుంబీకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE